Header Banner

జియో వినియోగదారులకు గుడ్‌న్యూస్! ఆ పాపులర్ ప్లాన్ మళ్లీ అందుబాటులోకి!

  Sun Feb 16, 2025 08:00        Technology

దేశంలోని దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పుడు తమ మొబైల్ టారిఫ్స్‌కు సంబంధించి 4 కీలక సవరణలు చేసింది. ముందుగా గతంలో చవక రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొచ్చిన తర్వాత.. అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్ అందిస్తూ లిమిటెడ్ డేటాతో చౌక ధరలకు అందించే ప్లాన్స్ ఎత్తేసింది. ఇందులో రూ. 189, రూ. 479 ప్లాన్స్ మంచి ఆదరణ పొందాయి. ఇక్కడ అపరిమిత కాల్స్, ఎస్ఎంఎస్ సహా.. పరిమిత డేటా కూడా వచ్చేది. రూ. 189 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాల్స్ రోజుకు 100 SMS లతో పాటు మొత్తంగా 2GB డేటా వచ్చేది. ఇంకా రూ. 479 ప్లాన్‌లో పైఫీచర్లతో పాటు 6GB డేటా వచ్చేది. తక్కువ డేటా కావాలనుకునే వారికి.. పెద్దగా డేటా వద్దనుకునే వారికి ఇవి ఉపయోగకరంగా నిలిచాయి. 

 

అయితే ఆ తర్వాత.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) డేటా లేకుండా ఫీచర్ ఫోన్స్ కోసం, డేటా అవసరం లేని వారి కోసం అసలు డేటా లేకుండా వాయిస్ ఓన్లీ ప్లాన్స్ తీసుకురావాలని ఆదేశించగా.. జియో, ఎయిర్‌టెల్ సహా పలు టెలికాం కంపెనీలు మళ్లీ ప్లాన్స్ మార్చేశాయి. అప్పుడు కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సర్వీసులతోనే ప్రత్యేకంగా ప్లాన్స్ తెచ్చింది. ఇక్కడ డేటా ఏం లేదు. ఈ క్రమంలోనే రూ. 189, రూ. 479 ప్లాన్స్ తొలగించింది. 

 

ఇది కూడా చదవండి: ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త! వల్లభనేని వంశీ హైదరాబాద్ లో అరెస్టు! పండుగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇక్కడే పలువురు కస్టమర్లు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అసలు లేకుండా ఉండటం కంటే కొంత డేటా ఉంటే.. చిన్న చిన్న అవసరాలకు వినియోగించుకోవచ్చనుకున్న వారికి కష్టమైంది. అయితే.. కస్టమర్ల డిమాండ్ దృష్ట్యా మళ్లీ రూ. 189 రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇక్కడ అదే 28 రోజుల వ్యాలిడిటీతో, 300 SMS లు తెచ్చి.. మొత్తంగా 2GB డేటా అందిస్తోంది. ఇంకా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్స్ కూడా అందిస్తోంది. ఇక రూ. 189 ప్లాన్ తెచ్చినప్పటికీ.. రూ. 479 ప్లాన్ తీసుకురాలేదు. 

 

ఇతర మార్పుల విషయానికి వస్తే రూ. 69, రూ. 139 డేటా ప్యాక్స్ వ్యాలిడిటీల్ని సవరించింది. ఈ యాడ్ ఆన్ ప్యాక్స్‌కు ప్రత్యేక వ్యాలిడిటీ ఉండేది కాదు. ఇక్కడ యూజర్ బేస్ ప్లాన్ వ్యాలిడిటీనే ఉండేది. యాక్టివ్ రీఛార్జ్ ఉన్నంత కాలం ఇవి అమల్లో ఉండేవి. ఇప్పుడు వీటి వ్యవధిని కేవలం వారం రోజులకు తగ్గించేశాయి. రూ. 69 అనేది 6GB డేటా, రూ. 139 తో 12 GB డేటా వచ్చేది. ఇదే సమయంలో రూ. 448 ప్రీపెయిడ్ ప్లాన్‌ను రూ. 445కు తగ్గించింది. ఇక్కడ 28 రోజుల వ్యవధికి రోజుకు 2GB డేటా వస్తుంది. వీటికి అదనంగా ఇక్కడ జీ5, జియో సినిమా ప్రీమియం, సోనీ లివ్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్ కూడా వస్తుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రో 8 నెల‌ల్లో.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే!

 

టోల్ ప్లాజా కొత్త నిబంధనలు.. కారులో వెళ్తున్నారా.ఈ తప్పు చేస్తే డబుల్‌ టోల్‌ చెల్లించాల్సిందే.!

 

జగన్ హయాంలో టీడీపీ ఎమ్మెల్యేపై అక్రమ కేసు నమోదు! కారణం ఇదే! వైసీపీ నేతల గుట్టురట్టు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్..! టీడీపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో కీలక నేతపై ఎఫ్‌ఐఆర్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Technology #Telecom #Jio #India